ఎస్పీజీ బలగాలకు నా ధన్యవాదాలు: రాహుల్

తమ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)రక్షణ ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు.  ఎన్నో సంవత్సరాలుగా అవిశ్రాంతంగా తనను, తన కుటుంబాన్ని కాపాడినందుకు ఎస్పీజీ బలగాలకు బిగ్ థ్యాంక్యూ చెప్పారు.  వారి అంకితభావాన్ని కొనియాడుతూ.. ఎస్పీజీ మద్దతు మరవలేనిదని, ఎస్పీజీతో ప్రయాణం ప్రేమమయంగా, కొత్త విషయాలు నేర్చుకునేలా సాగిందని ట్వీట్ చేశారు. ఎస్పీజీ రక్షణ పొందడం గౌరవంతో కూడుకున్నదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బలగాల్లో తమ కోసం పనిచేసిన సోదరసోదరీమణులందరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

 

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates