అమేథీతో పాటు వాయినాడ్ లో కూడా..

Rahul Gandhi to contest second seat from Wayanad in Kerala

ఉత్తర ప్రదేశ్ లోని అమేథీతో పాటు కేరళలోని వాయినాడ్ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు. ఈ  విషయాన్ని పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల్లోను రాహుల్ పోటీచేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జీవాలే తెలిపారు.

రాహుల్ గాంధిని దక్షిణాది నుంచి పోటీ చేయాల్సిందిగా కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు ప్రజలు కోరారని కాంగ్రెస్ లీడర్ ఏ.కే. అంటోని తెలిపారు. గత కొన్ని వారాలుగా అక్కడి నేతల మరియు కార్యకర్తల కోరక మేరకు రాహుల్ గాంధీ  వాయినాడ్ లో పోటీ చేసేందుకు ఒప్పుకున్నారని ఆయన అన్నారు.

Latest Updates