జల్లికట్టు చూసేందుకు మదురై కి రాహుల్ గాంధీ

సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు పోటీలను చూసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ రేపు(గురువారం) వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జల్లికట్టు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. అవనియపురం, పాలమేడు, అనంగా నల్లురులో జరిగే జల్లికట్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రేక్షకులు ఇప్పటికే తమిళనాడు చేరుకున్నారు. జల్లికట్టులో పాల్గొనేందుకు యువకులు  తమ  పేర్లను నవెూదు చేసుకున్నారు.

జల్లికట్టు క్రీడను చూసేందుకు  కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తమిళనాడు లోని మదురై జిల్లాకు వెళ్లనున్నారు.

Latest Updates