పంచెకట్టులో రాహుల్.. వెంకన్న దర్శనం

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమలలో వెంకన్నను దర్శించుకున్నారు. ఈ ఉదయం తిరుపతికి చేరుకున్న రాహుల్ గాంధీ.. తన మేనల్లుడు రేహన్ గాంధీతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమలకు మెట్లు ఎక్కుతూ చేరుకున్నారు. వడివడిగా వేగంగా కొండపైకి చేరుకున్న రాహుల్… పంచెకట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు.. ఆయన మేనల్లుడు రేహన్ గాంధీ కూడా పంచెకట్టులోనే గుడికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ క్యూలైన్లలోని భక్తులను పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు.  ఈ సాయంత్రం తిరుమలలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు.

 

Latest Updates