పుల్వామా దాడి: వివాదం అవుతున్న రాహుల్ ప్రశ్నలు..

పుల్వామా దాడి జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయనాయకులు అమర వీరులకు నివాళులు అర్పించారు. ఇందులో భాగంగా..  కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ పుల్వామా అమరులను స్మరిస్తూ.. మూడు ప్రశ్నలు అంటూ ట్వీట్ చేశారు.  ఈ రోజు 40మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లను తలచుకుంటున్నాం అంటూ.. ఇప్పుడు ప్రశ్నిందాం అని…
మొదటగా…
1. ఈ దాడి వలన ఎవరికి లాభం జరిగింది..?
2. దాడిపై జరిగిన ఎంక్వైరీలో ఏం తేలింది..?
3. సెక్యురిటీ లోపం వల్ల జరిగిన ఎటాక్ కు బీజేపీలో ఎవరు జవాబుదారి అని ప్రశ్నించారు.

అయితే ఈ ప్రశ్నలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాహుల్ గాంధీ ఏ సమయంలో ఏం అడుగుతున్నారని అంటున్నారు. అటాక్ జరిగాక అమరులకు నివాళులు అర్పిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఫోన్ చూడడంలో బిజీగా ఉన్నారని అప్పటిఫొటోలను రిట్వీట్ చేస్తున్నారు.

పుల్వామా దాడి జరిగిన తరువాత… భారత ఎయిర్ ఫోర్స్ బాలా కోట్ లో ఉన్న ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయని నెటిజన్లు రిప్లే ఇస్తున్నారు.

Latest Updates