పీసీసీ, సీఎల్పీ నేతలతో రాహుల్ వార్ రూమ్ భేటీ

 ఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన వార్ రూమ్ లో కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. సమావేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి పీసీీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికను పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులతో మరొకసారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.

Latest Updates