వయనాడ్ నుంచి రేపు రాహుల్ నామినేషన్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ లోని వయనాడ్ నుంచి నామినేషన్ వేయనున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీ ఇప్పటికే నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఎప్పటిలాగే బరిలో దిగుతున్నారు. దీంతోపాటు.. సౌత్ ఇండియాపైనా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గం…. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు లోక్ సభ సెగ్మెంట్ అయిన వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కేరళ కోజికోడ్ లో ఈ సాయంత్రం అడుగుపెట్టిన రాహుల్ గాంధీ.. రేపు వయనాడ్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు.

కోజికోడ్ నుంచి … వయనాడ్ కు హెలికాప్టర్ లో వెళ్తారు రాహుల్ గాంధీ. చెల్లెలు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా, ఇతర పార్టీ ముఖ్యులు రాహుల్ తో పాటు.. నామినేషన్ వేసేందుకు వెళ్తారు. వయనాడ్ లో రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ వేస్తారు రాహుల్ గాంధీ. అంతకుముందు భారీస్థాయిలో రోడ్ షో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.

Latest Updates