మోడీకి, బీజేపీకి రాహుల్ అభినందనలు : రాజీనామాకు రెడీ!

లోక్ సభ ఎన్నికల్లో దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. నరేంద్రమోడీ, బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.

మోడీ గెలవాలని దేశ ప్రజలు కోరుకున్నారు… వారి అభిప్రాయాన్ని, నిర్ణయానికి రెస్పెక్ట్ ఇస్తున్నామని చెప్పారు రాహుల్. ఫలితాలపై అప్పుడే లోతుగా స్పందించడం… నిందలు, ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదనీ.. గెలిచిన వారిని అభినందించడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటమి సహజంమనీ… తమ పార్టీ వాళ్లు కొందరు గెలిచారు.. కొందరు ఓడిపోయారని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మేవారు దేశంలో ఎంతోమంది ఉన్నారనీ… వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అమేథీలో తనను ఓడించిన స్మృతి ఇరానీకి శుభాకాంక్షలు చెప్పారు. అమేథీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆమె పనిచేయాలని కోరారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా…

లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ సిద్ధపడినట్టు సమాచారం. సోనియాగాంధికి రాజీనామా అందజేసే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తోంది.

రాజీనామా అంశంపై మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడు “అది పార్టీకి, నాకు మధ్య మాటర్” అని రాహుల్ గాంధీ అన్నారు. రాజీనామా వార్తలు వట్టి మాటలే అని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు.

Latest Updates