వరదలతో కేరళ రైతులు నష్టపోయారు.. రుణ గడువును పెంచండి

వరదలతో కేరళ రైతులు తీవ్రంగా నష్టపోయారని… చెల్లించాల్సిన లోన్ ల గడువును పెంచాలని RBI గవర్నర్ కు ఉత్తరం రాశారు కాంగ్రెస్ నాయకులు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. కేరళ రైతు రుణాల చెల్లింపుపై ఉన్న మారటోరియంను పొడిగించాలని  కొరారు. గతేడాది, ఈ ఏడాది వరుసగా కేరళను వరదలు కుదిపేసిన విషయం శక్తికాంతదాస్ దృష్టికి తీసుకెళ్లారు. వందేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు గతేడాది కేరళను ముంచాయన్నారు రాహుల్. వరుసగా రెండేళ్లపాటు వచ్చిన వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని… అందుకే డిసెంబర్ వరకు మారటోరియం గడువు పెంచాలని రాహుల్ కోరారు.

Latest Updates