హెలికాప్టర్ మెకానిక్ గా రాహుల్.. సోషల్ మీడియాలో వైరల్

Rahul helps ‘fix’ his helicopter in Himachal’s Una, shares photo on Instagram

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెకానిక్ గా మారాడు . ఆ దృశ్యాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమచల్ ప్రదేశ్ లోని ఉనాలో శుక్రవారం రాహుల్ పర్యటించారు.  ప్రచారం ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో రాహుల్ ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్  కొంచెం ట్రబుల్ ఇచ్చింది. దీంతో అతని హెలికాప్టర్ సిబ్బంది రిపేర్‌ చేయడం మొదలుపెట్టగా రాహుల్ కూడా ఓ చెయ్యేశారు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంచి టీం వర్క్‌ అంటే అన్ని చేతులు కలిసి పనిచేయడమే. ఉనా పర్యటన సమయంలో మా హెలికాప్టర్‌లో సమస్య ఎదురైంది. మేమంతా కలిసి దాన్ని త్వరగా సరిచేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏం కాలేదు’ అని రాహుల్ తెలిపారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Updates