రాహుల్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు

భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో 3 వందలకు పైగా సీట్లు వస్తాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మై భీ చౌకీదార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… కాంగ్రెస్ పార్టీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ ఒక ఫెయిల్యూర్ నాయకుడన్నారు. అంతే కాకుండా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రాపై కూడా వ్యాఖ్యలు చేశారు.  లోక్‌సభ ఎన్నికలకు కేవలం 60 రోజుల ముందు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి తేరంగేట్రం చేశారని…. ఆమె కేవలం తన ఫెయిల్యూర్ సోదరుడు రాహుల్ గాంధీని ఈ ఎన్నికల్లో గట్టెక్కించడానికే వచ్చారని విమర్శించారు మంత్రి పీయూష్ గోయల్.

Latest Updates