1న రాష్ట్రానికి రానున్న రాహుల్

ఏఐసీసీ చీఫ్‌‌‌‌ రాహుల్‌ ‌‌‌గాంధీ వచ్చే నెల 1న రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఒకే రోజు మూడు లోక్‌ సభ సెగ్మెం ట్ల పరిధిలోని సభల్లో పాల్గొంటారు. 1న మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ సభలో, 2 గంటలకు నాగర్ కర్నూ ల్ లోక్‌ సభ పరిధిలోని వనపర్తిలో, 4 గంటలకు నల్గోండ జిల్లా హుజూర్‌‌‌‌నగర్ లో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. తెలంగాణలో చేవెళ్ల వేదికగా ఈ నెల 9నే ప్రచారాన్ని రాహుల్‌‌‌‌ మొదలు పెట్టారు. ఇక్కడే కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించారు. ప్రచారానికి ఏప్రిల్‌‌‌‌ 9 వరకే గడువు ఉండటంతో మూడ్రోజుల వ్యవధిలో మరో రెండు సార్లు రాష్ట్రానికి రాహుల్‌‌‌‌ వస్తా రని పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ షెడ్యూలు ఖరారైన తర్వాత తొలిసారిగా ఆయన రాష్ట్రానికి వస్తుండటంతో సభలను భారీగా నిర్వహించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సమాయత్తమయ్యాయి

Latest Updates