సారీ చెప్పను.. నేను తప్పుగా మాట్లాడలేదు

రాహుల్ గాంధీ చేసిన రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందిగా బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. తాను ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో సమాధానం చెబుతానన్నారు. మోడీ ఎప్పుడు మేక్ ఇన్ ఇండియా  అంటారు.. కానీ మన దేశంలో అత్యాచారాలే ఎక్కువ జరుగుతున్నాయని..అందుకే తాను అలా అన్నాని అన్నారు. సిటిజన్ షిప్ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుందని..దాని నుంచి ప్రజల  దృష్టి మరల్చేందుకు తన వ్యాఖ్యలను బీజేపీ  తప్పుబడుతున్నారన్నారు.

గతంలో మోడీ కూడా అత్యాచారాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని రాహుల్ అన్నారు. ఢిల్లీని రేప్ క్యాపిటల్ అని మోడీ అన్న వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాహుల్..మోడీ కూడా క్షమాపణలు చెప్పాలని అన్నారు.

Latest Updates