టాటా ఫ్యాక్టరీ భూములు రైతులకు తిరిగి పంచిన రాహుల్

చత్తీస్ గఢ్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛత్తీస్ గఢ్ లో… టాటా ఫ్యాక్టరీ భూనిర్వాసితులకు భూ పంపిణీ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. బస్తర్ ప్రాంతంలోని జగదల్ పూర్ లో నిర్వహించిన బహిరంగసభలో ఎవరి  భూమి వారికి తిరిగి పంపిణీ చేశారు. భూసేకరణ చట్టం ప్రకారం సేకరించినా…. ఐదేళ్లలోపు ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోతే… ఆ భూములు మళ్లీ పూర్వ యజమానులకే చెందుతాయి. దాని ప్రకారమే టాటా ఫ్యాక్టరీకి పదేళ్ల క్రితం ఇచ్చిన భూములను చత్తీస్ గఢ్ లోని భూపేష్ భఘెల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుని… వాటి యజమానులకు పంపిణీ చేసింది.

Latest Updates