భయపడనన్న కొద్ది సేపటికే ట్వీట్ డిలీట్ చేసిన రాహుల్

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దేశరాజకీయాలు వేడెక్కాయి. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. ఈ రోజు బీహార్ లోని పూర్ణియా పట్టనంలో జరిగిన భహిరంగ సభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మాట్లాడారు. తాను ఎవరినీ చూసి భయపడనని చెప్పారు. ముఖ్యంగా మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు భయపడనని అన్నారు. తాను కేవలం సత్యానికి మాత్రమే భయపడతానని తెలిపారు.

ప్రతీ రోజు బీహార్ ప్రజల జేబు నుంచి పైసలు చోరీ జరుగుతున్నాయని రాహుల్ చెప్పారు. ఇప్పటికైనా బీహార్ యువత మేలుకోవాలని అన్నారు. ఇందుకు రాహుల్ తన టిటర్ లో కూడా రాసుకొచ్చారు. అయితే ట్వీట్ చేసిన కొద్ది సేపటికే డిలీట్ చేశారు.

Latest Updates