మోడీజీ మీ టైమైపోయింది : రాహుల్

న్యూఢిల్లీ, మోరెనా(మధ్యప్రదేశ్): ‘మోడీజీ! మీ టైమైయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చింది’ అంటూ కాంగ్రెస్ ​చీఫ్ ​రాహుల్ ​గాంధీ ట్వీట్  చేశారు. మరో రెండు దశల లోక్​సభ ఎన్నికలు మిగిలి ఉండగానే ఈ సంగతి తేలిపోయిందని చెప్పారు. యువత, వృద్ధులు అంతా కాంగ్రెస్​ ప్రకటించిన న్యాయ్ ​పథకానికే ఓటేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ ​శాతం చెప్పేదిదేనని అన్నారు. కేంద్రంలో మార్పునకు టైం వచ్చిందన్నారు. ప్రధాని మోడీపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఆయన మరోసారి ప్రధాని అవడం కల్ల అని రాహుల్ జోస్యం​చెప్పారు. మధ్యప్రదేశ్​లోని మోరెనాలో పార్టీ ప్రచార సభలో ఆయనీ కామెంట్స్​చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోడీ ఇప్పుడేం చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజాలను ఫేస్​చేసే శక్తి ఆయనకు లేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టారని రాహుల్​మండిపడ్డారు. మోడీ నిర్ణయంతో దేశంలోని దొంగలందరూ తమ బ్లాక్​మనీని వైట్​గా మార్చేసుకున్నారని ఆరోపించారు. 15 మంది బడాబాబుల అప్పులను మాఫీ చేసిన మోడీ సర్కారుకు రైతులు, యువతపైన మాత్రం కనీస సానుభూతి లేదని విమర్శించారు. పంటల్లేక అప్పు చెల్లించలేని రైతులను జైళ్లకు పంపారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి ఉండదని రాహుల్​హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లడం, బడా పారిశ్రామికవేత్తలతో కలిసి తిరగడం మోడీ అలవాటని చెబుతూ.. పేదలు, సామాన్యులతో కలిసి ఉండడమే తనకిష్టమని రాహుల్​చెప్పారు.

సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణ

రాఫెల్​ డీల్ విషయంలో ‘చౌకీదార్​ చోర్​హై’ అన్న కామెంట్​ను కోర్టు తీర్పునకు ఆపాదించడంపై రాహుల్ ​గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంపై తనకు గౌరవముందని అన్నారు. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్​ సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని చెబుతూ కోర్టు ధిక్కార కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్ ​విచారణ సందర్భంగా రాహుల్ ​మూడు పేజీల అఫిడవిట్​ను కోర్టుకు అందజేశారు.

Latest Updates