కాంగ్రెస్​కి రాహులే సమస్య

న్యూఢిల్లీ:లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే రాహుల్​ గాంధీ వెళ్లిపోవడమే కాంగ్రెస్​ పార్టీకి పెద్ద ప్రాబ్లంలా మారిందని ఆ పార్టీ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్​ ఖుర్షీద్​ అన్నారు. లోక్​సభ ఎన్నికలైన వెంటనే రాహుల్​ తప్పుకోవడంతో ఆయన రాజీనామానే చర్చనీయాంశమైందని, నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా ఫలితాలపై పార్టీలో చర్చ జరగలేదని చెప్పారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

‘‘రాహుల్​ వెళ్లిపోవడంతో పార్టీలో ఖాళీ​ ఏర్పడింది. దాన్ని పూడ్చడానికి సోనియా తాత్కాలిక బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఫుల్​టైమ్​ చీఫ్​గా కొనసాగితేనే పార్టీ బతుకుతుంది’’అని అన్నారు. లోక్​సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​కు గుడ్​బై చెబుతున్న నేతలపై ఖుర్షీద్​ మండిపడ్డారు. కాంగ్రెస్​ ద్వారా ఎన్నో లాభాలు పొంది, తీరా కష్టకాలంలో పార్టీని వీడటం దుర్మార్గమని, తాను మాత్రం చివరిదాకా కాంగ్రెస్​లోనే కొనసాగుతానని ఖుర్షీద్​ చెప్పారు.

Latest Updates