రాహుల్ గాంధీ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతీ పేద కుటుంబానికి కనీస ఆదాయం అందిస్తుందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రైతులు, పేదల కోసం మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. పరివర్తన్ బస్ యాత్రలో భాగంగా… హర్యానాలోని యమునా నగర్ లో రాహుల్ ప్రచారం చేశారు.

రైతు రుణాలు మాఫీ చేయమని ప్రధాని మోడీని అడిగితే… అది తమ విధానం కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బదులిచ్చారని రాహుల్ ఆరోపించారు. ప్రజల అనుమతి లేకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు తీసుకుని ఇన్సూరెన్స్ పాలసీ చేస్తున్నారని… ఆ డబ్బంతా అంబానీ, అదానీ కంపెనీలకు పోతోందన్నారు రాహుల్.

హర్యానా యమునానగర్ లో అంతకుముందు బస్సులో రోడ్ షో నిర్వహించారు రాహుల్ గాంధీ. ఇవాళ యమునా నగర్, లాద్వా, కర్నాల్ లలో పర్యటించారు. బస్సులో ముందు భాగంలో కూర్చుని.. రోడ్డు పక్కన తనకు స్వాగతం పలకడానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు రాహుల్. ఓ చోట బస్సు ఆపించారు రాహుల్ గాంధీ. బందోబస్తు, బారికేడ్లను తోసుకుని అభిమానులు బస్సు దగ్గరకు దూసుకొచ్చారు. బస్సు కిటికీ నుంచి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషపరిచారు.

మరో చోట బస్సు నుంచి దిగి బారికేడ్ల అవతల నిల్చున్న వారి దగ్గరకే వెళ్లారు. అభిమానులు రాహుల్ గాంధీపై పూలు చల్లడంతో సెక్యూరిటీ వారించారు.

Latest Updates