రేపు తిరుపతిలో రాహుల్ పర్యటన

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ  తిరుపతి పర్యటన ఖరారైంది. రేపు (శుక్రవారం, ఫిబ్రవరి- 22) మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని… ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.  సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా- ప్రజాయాత్ర రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత తారకరామా స్టేడియంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు రాహుల్. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేపడుతున్నారు.

Latest Updates