రాయచూర్ లో సంచలనం.. యువతి సజీవ దహనం!

కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఇంజినీరింగ్ చదువుతున్న యువతి హత్య సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 15న ఆమెపై మిస్సింగ్ కేసు నమోదైంది. ఏప్రిల్ 16న రాయ్ చూర్ శివారులోని అడవి ప్రాంతంలో ఆమె డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. సగం శరీరం కాలిపోయిన పరిస్థితిలో.. ఓ చెట్టుకు వేలాడుతూ ఆమె డెడ్ బాడీ ఉంది. ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

స్పాట్ లో ఓ సూసైడ్ నోట్ కూడా ఉంది. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయనే ఉద్దేశంతో తనను తానే చంపుకున్నట్టు… ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఐతే… ఆమె కుటుంబసభ్యులు మాత్రం అది ఆత్మహత్య కాదు.. మర్డర్ అని అంటూ.. పోలీసులకు కంప్లైంట్ చేశారు.

3రోజులుగా అమ్మాయి కనిపించకపోవడంతో… పోలీసులకు ఫిర్యాదు చేశామని తల్లిదండ్రులు చెప్పారు. ఇంజినీరింగ్ అమ్మాయిని హత్య చేసినట్టుగా తమకు ఓ కంప్లైంట్ వచ్చిందని రాయ్ చూర్ ఎస్పీ కిశోర్ బాబు చెప్పారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామనీ… దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

సోషల్ మీడియాలో దీనిపై దుమారం రేగుతోంది. ఓ అమ్మాయిని అన్యాయంగా చంపేశారనీ… ఆమెకు న్యాయం జరగాలని యువత కోరుతోంది. ఇందుకు సంబంధించిన అసలు వాస్తవం ఇదీ అంటూ ఫొటోలు, కథనాలు పోస్ట్ చేస్తున్నారు. కేసులో వాస్తవం ఏంటో దర్యాప్తులో తేల్చుతామని పోలీసులు అంటున్నారు.

యువత ఏమంటోందంటే…?

“ఆమె పేరు మధు. సివిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్. ఆమెకు బ్యాక్ లాగ్స్ లేవు. అన్ని పరీక్షలను క్లియర్ చేసింది. కానీ.. ఆమె హత్య దారుణంగా జరిగింది. అడవి మధ్యలో ఓ చెట్టుకు ఆమె బాడీ వేలాడేసి ఉంది. అంతకుముందే ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. ఆ తర్వాత ఆమెను సజీవదహనం చేశారు. ఆమె ఎడమ చేతిని నరికేసి ఉంది. ఈ దారుణం చూసిన ఎవరికైనా అది ఆత్మహత్య అనిపించదు. ఆమే రాసినట్టుగా సూసైడ్ నోట్ ను క్రియేట్ చేశారు. ఎన్నో పెద్ద తలకాయలు ఆమె హత్యను.. ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అవినీతి నాయకులు, పోలీసులు.. ఈ కేసును క్లోజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. 3 రోజులు వెతికితేకానీ ఆమె డెడ్ బాడీ దొరకలేదు. మధుకు న్యాయం జరగాలి. అసలు దోషులెవరో తేలాలి. ఈ అన్యాయం రేపు మనలో ఎవరికైనా జరగొచ్చు. ఆమెకు… వారి కుటుంబానికి న్యాయం కోసం పోరాడదాం. దర్యాప్తు న్యాయంగా జరిగేలా ఒత్తిడి చేద్దాం” అంటూ నినదిస్తున్నారు యువత.

ట్విట్టర్ లో #JusticeForMadhu పేరుతో హ్యాష్ ట్యాగ్ రన్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.

 

Latest Updates