రైళ్లలో ఇక ఫుల్ ​ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

‘రైల్​టెల్​ మొబైల్​ యాప్’ తెచ్చే యోచనలో రైల్వే 

సినిమాలు, న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూజిక్, సీరియల్స్ అన్నీ ఫ్రీ

ప్రీలోడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ  వీడియోలూ చూడొచ్చు

యాడ్స్​ ద్వారా రైల్వేకు ఆదాయం కూడా వచ్చే చాన్స్​

యాప్​ కోసం రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌తో రైల్వే శాఖ ఒప్పందం

అన్ని ప్రాంతీయ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి  

మీరు రైళ్లలో లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీ చేస్తున్నారా..? ఎంతకీ టైంపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాకుండా బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుతోందా..? ఇక నుంచి బోర్​కొట్టేందుకు చాన్స్​ఉండదు. ఎందుకంటే రైళ్లలో ఇక త్వరలోనే ఫ్రీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుబాటులోకి రానుంది.  సినిమాలు, సీరియళ్లు, వీడియోలను మీ సెల్​ఫోన్​లో ఉచితంగా చూడవచ్చు. ఎలాంటి బఫరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ వీడియోలు వీక్షించవచ్చు. ఇందుకోసం ఒక మొబైల్​యాప్​ను రూపొందించేందుకు రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రైల్వే శాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ప్రపోజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే ఆ కంపెనీ ప్రకటించనుంది.

అన్ని ప్రాంతీయ భాషల్లో..

ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ దృష్టిసారించింది. ఫ్రీ వీడియోలు చూసేలా చర్యలు తీసుకుంటోంది. ఇదే విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా తెలిపారు. రైళ్లలో ప్యాసింజర్లకు ప్రీ లోడెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాలు, న్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మ్యూజిక్, టీవీ సీరియల్స్, భక్తి, లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్ వంటి వినోద కార్యక్రమాలు అందిస్తారు. ఇవన్నీ వివిధ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్యాబ్లెట్లలో డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకుని, దాని ద్వారా వార్తలు, సినిమాలు, ఇతర ప్రోగ్రాంలను ఉచితంగా చూడవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే గతంలో శతాబ్ది, తేజస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో సీట్లకు ముందు స్క్రీన్లు ఏర్పాటు చేయగా, వాటిని గుర్తుతెలియని వారు పగలగొడుతున్నారు. దీంతో ఈ తరహా విధానం తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీని ద్వారా యాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో ఆదాయం కూడా పొందాలని యోచిస్తోంది.

ఇప్పటికే మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తున్నారు. 2019నాటికి దేశంలోని మరో 4 వేల స్టేషన్లలో వైఫై సౌకర్యం అందించేందుకు రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 207 స్టేషన్లలో వైఫై సౌకర్యం ఉంది. ఇదే కాకుండా  రైల్వే మ్యూజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీ కూడా కల్పిస్తోంది. మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైఫై ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొన్ని రైళ్లో ఏర్పాటు చేశారు. ప్యాసింజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోయినా దీని ద్వారా మ్యూజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినవచ్చు. దీన్ని మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్యాబ్లెట్లలో సెట్టింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైఫైను సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుని, కనెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Latest Updates