ఇక నుంచి రైళ్లలో మట్టి కప్పుల్లోనే చాయ్

మట్టి కప్పుల్లో చాయ్​ 

ప్లాస్టిక్ కప్పులకు రైల్వే నో

జైపూర్: రైల్వే స్టేషన్లలో ఇకపై మట్టి కప్పుల్లోనే చాయ్​ అమ్మాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయెల్​ ఆదివారం వెల్లడించారు. ప్లాస్టిక్​ కప్పుల ద్వారా పర్యావరణానికి కలిగే హానిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తొలుత దేశవ్యాప్తంగా ఉన్న 400 రైల్వే స్టేషన్లలో ప్రారంభించి, క్రమంగా అన్ని స్టేషన్లలోనూ అమలు చేస్తామని మంత్రి వివరించారు. ఈమేరకు రాజస్థాన్​లోని అల్వార్​ జిల్లా దిగావర రైల్వే స్టేషన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్​ కప్పులలో చాయ్​ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, పర్యావరణానికి కూడా ఈ కప్పులతో హాని తప్పదని అన్నారు. పేపర్​ కప్పులు కూడా మంచిది కాదని ఇటీవలి రీసెర్చ్​లో తేలిందన్నారు. ఈ క్రమంలో ఇటు ఆరోగ్యానికి, అటు ఎన్విరాన్​మెంట్​కు మేలు చేసే మట్టి కప్పులను ఉపయోగించడమే మేలన్నారు. ఈ మట్టి కప్పుల తయారీ ద్వారా వేలాది మందికి ఉపాధి కూడా దొరుకుతుందని మంత్రి గోయెల్​ వివరించారు.

For More News..

ఒక్క టెర్రరిస్టును పట్టించినందుకు 60 మంది రైతుల హతం

ఇంటర్నల్ క్యాంపెయిన్​ షురూ.. వాట్సాప్​ మెసేజ్, ఫేస్​బుక్​‌లే కీలకం

గ్రేటర్ బెట్: ఏ పార్టీకి ఎన్ని సీట్లోస్తయ్.. రూ. 2 వేల నుంచి రూ. 10 లక్షల దాకా బెట్టింగ్

Latest Updates