టిక్ టాక్ తో ప్రాణాలు తీసుకోవద్దు

న్యూఢిల్లీ: టిక్‌‌‌‌టాక్‌‌‌‌తో ప్రాణాలు తీసుకోవద్దని రైల్వే  వర్గాలు ప్రయాణికుల్ని కోరింది.  ఈ మధ్యనే ఒక  అబ్బాయి కదులుతున్న ట్రైన్‌‌‌‌లో టిక్‌‌‌‌టాక్‌‌‌‌వీడియో చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. అదృష్టవశాత్తు పక్కకు దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌‌‌‌కావడంతో  రైల్వే మినిస్ట్రీ ఆ టిక్‌‌‌‌టాక్‌‌‌‌వీడియోను ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌చేసింది. “ జీవితం ఎంతో అమ్యూలమైంది. కదిలే రైలు నుంచి ఇలాంటి స్టంట్లు చేయడం ప్రమాదకరం. దయచేసి ఇలాంటివి చేయొద్దు.. పక్క వాళ్లను చేయనీయొద్దు” అని ట్వీట్‌‌‌‌చేసింది. ఈ  ఇష్యూపై  రైల్వే మినిస్టర్‌‌‌‌‌‌‌‌పీయూష్‌‌‌‌గోయల్‌‌‌‌కూడా సీరియస్‌‌‌‌అయ్యారు. “కదులుతున్న రైలులో ఇలాంటి సాహసాలు చేయడం మూర్ఖత్వం. ఇలాంటి సాహసాలు చేసి ప్రాణాలు  తీసుకోవద్దు ” అని మంత్రి ట్వీట్‌‌‌‌చేశారు.

 

Latest Updates