కాంట్రాక్ట్‌ జాబ్‌.. కిలోమీటర్‌ క్యూ

రైల్వేడిపార్ట్ మెంట్ లో కాంట్రాక్టు జాబ్ కు నిరుద్యోగులు పోటెత్తారు. దీంతో తార్నాక రోడ్ లో యువతీ యువకులు భారీ క్యూ కట్టారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎస్ ఎన్ టీ డిపార్ట్​మెంట్ లో జూనియర్​ టెక్ నికల్ అసోసియేట్స్(జే టీఏ)గా పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్  జారీ చేసింది. ఏడాదిపాటు కాంట్రాక్టు బేసిక్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బుధవారం తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు అధికంగా తరలివచ్చారు. సివిల్ఇంజినీరింగ్ విభాగంలో జేటీఏ 47, ఎలక్ట్రికల్  విభాగంలో జేటీఏ13, ఎస్ ఎన్ టీ విభాగంలో జేటీఏ 03 ఖాళీలకు సివిల్ ఇంజినీరింగ్ అర్హత కావడంతో వేలాదిగా హాజరయ్యారు. తొలుత ఇంటర్వ్యూలకు హాజరైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి టోకెన్ ఇచ్చారు. దశల వారీగా పిలిచి ఇంటర్వ్యూ నిర్వహిస్తామని రైల్వేఅధికారులు తెలిపారు.

Latest Updates