మ‌రో మూడు రోజుల్లో 300 శ్రామిక్ రైళ్లు.. కేంద్ర మంత్రి ప్ర‌క‌ట‌న‌

పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు భారీగా రైళ్ల సంఖ్య‌ను పెంచ‌నున్న‌ట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్ర‌ధాని న‌రేం‌ద్ర మోడీ ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లో 300 శ్రామిక్ రైళ్లను ప్రతిరోజూ నడపనున్నట్టు తెలిపారు. మూడు నుంచి నాలుగు రోజుల్లో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించనున్నట్లు గోయల్ స్పష్టం చేశారు. ఇందుకు ఆయా రాష్ట్రాలు కూడా సహకరించాలని ఆయ‌న కోరారు.
ఈ మేరకు మంత్రి ట్వీట్ చేస్తూ .. ఇప్పటికీ వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో వారంతా తమ స్వస్థలాలకు చేర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Updates