ప్యాసింజర్లకు రైల్వే బంపర్‌‌‌‌‌‌‌‌ ఆఫర్‌

  • ‌‌‌‌‌‌‌ప్లాస్టిక్‌ బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీ చార్జ్‌

న్యూఢిల్లీ: ప్లాస్టిక్‌‌‌‌ వాడకాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది . ‘ప్లాస్టిక్‌‌‌‌ బాటిల్‌ క్రషర్స్‌‌‌‌’ ఉపయోగించే ప్యాసింజర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బాటిల్‌ ను క్రష్‌ చేసి రీ చార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు చెప్ పారు. ప్యాసింజర్‌ ఫోన్‌ నంబర్‌ ‘కీ’ ద్వారా క్రషింగ్‌ మిషెన్‌ ను ఉపయోగించి బాటిల్‌ క్రష్‌ చేస్తే ఫోన్‌ రీ చార్జ్‌ అవుతుందని రైల్వే బోర్డ్‌‌‌‌ చైర్మన్‌ వి.కె. యాదవ్‌ చెప్పారు. ఈ మేరకు దేశంలో 400 మిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రీ చార్జ్‌ కు సంబంధిం చి వివరాలను చెప్పలేదు. ప్రస్తుతం 128 స్టేషన్లలో 160 బాటిల్‌ క్రషింగ్‌ మిషెన్స్‌‌‌‌ ఉన్నాయి, ప్లాస్టిక్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌ అన్నింటి నీ కలెక్ట్‌ చేసి రీ సైక్లింగ్‌ కు పంపాలని సిబ్బందిని ఆదేశించామని యాదవ్‌ చెప్పారు. సింగిల్‌ యూజ్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ను నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలని పంద్రాగస్టు రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు రైల్వే ఈ చర్యలు తీసుకుంటోంది . ఆక్టోబర్‌ 2నుంచి రైల్వే లో ప్లా స్టిక్‌‌‌‌పై నిషేధం విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

Latest Updates