పట్టాలెక్కనున్న 80 స్పెషల్ ట్రెయిన్స్

ఆక్యుపెన్సీని బట్టి మరిన్ని రైళ్లు

రైల్వే శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేస్ మరో 80 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ప్రస్తుతం నడుస్తున్న 230 స్పెషల్ ట్రెయిన్స్ కు అదనంగా ఈ రైళ్లను పట్టాలెక్కించనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఈ స్పెషల్ ట్రెయిన్స్ రిజర్వేషన్స్ 10వ తేదీ నుంచి మొదలవ్వనున్నాయని పేర్కొంది. ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉన్న రూట్లలో వెయిటింగ్ లిస్ట్ ను బట్టి క్లోన్ ట్రెయిన్స్ ను కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.

‘80 కొత్త స్పెషల్ ట్రెయిన్స్ లేదా 40 జతల ట్రెయన్స్ సెప్టెంబర్ 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. ఈ నెల 10 నుంచి వాటికి సంబంధించిన రిజర్వేషన్స్ మొదలవుతాయి. ఇప్పటికే నడుస్తున్న 230 ప్రత్యేక రైళ్లకు ఇవి అదనం. వీటిలో చాలా రైళ్లు శ్రామిక్ ట్రెయిన్స్ కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. ప్రయాణికులను హోం ప్లేసెస్ లో వదిలేసి అవి వర్క్ ప్లేసెస్ కు వెళ్లిపోతున్నాయి. అన్ని రైళ్లలోనూ ఆక్యుపెన్సీని మేం గమనిస్తున్నాం. డిమాండ్ ను బట్టి మరిన్ని ట్రెయిన్స్ ను నడపడంపై సమాలోచనలు చేసి నిర్ణయం తీసుకుంటాం’ అని రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో వీకే యాదవ్ చెప్పారు.

Latest Updates