టీమిండియా వరల్డ్ కప్ ఆశలపై వాన పిడుగు

3 ఓవర్లకే కీలకమైన 3 వికెట్లు డౌన్

పది ఓవర్లలోనే నాలుగు వికెట్లు డౌన్

పవర్ ప్లేలో వరల్డ్ కప్ లోనే అతి తక్కువ స్కోరు చేసిన ఇండియా

మూడే ఓవర్లు పూర్తయ్యాయి.. ఐదే పరుగులొచ్చాయి. అప్పటికే అత్యంత కీలకమైన వికెట్లు వికెట్లు పడ్డాయి. వర్షం కారణంగా పిచ్ పరిస్థితి మారిపోవడం.. బాల్ ఎక్కువగా స్వింగ్ కావడంతో… చేజింగ్ లో ఉన్న భారత్ కు మొదట్లోనే భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇలా.. వెంటవెంటనే వికెట్లు పడిపోయాయి. మధ్యలో జడేజా, ధోనీ వికెట్ల పతనం ఆపి… గెలుపుపై ఆశలు రేపినప్పటికీ.. న్యూజీలాండ్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని అనడం కన్నా.. భారత బ్యాట్స్ మన్ నిర్లక్ష్యంగా ఆడారని చెప్పడం కన్నా.. ఇది వాన పిడుగు అని చెప్పడమే కరెక్ట్ అంటున్నారు విశ్లేషకులు.

టాప్ ఫామ్ లో ఉన్న భారత బ్యాట్స్ మన్.. బాల్ ను బ్యాట్ తో కనెక్ట్ చేయడానికి ప్రయత్నించేలోపే ఔటైపోయారు. బంతి ఊహించనంతగా స్వింగ్ కావడం.. కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. ఆ దేశం కూడా ఊహించని ఘనమైన ఆరంభం వారికి లభించింది. అదే భారత్ ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈజీ టార్గెట్ కూడా భారత్ కు కొండంత అయిపోయింది.

వరల్డ్ కప్ పవర్ ప్లేలో కోహ్లీ గ్యాంగ్ లీస్ట్ స్కోర్

ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 27 రన్స్ మాత్రమే చేసింది. ఈ వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు కివీస్ పేరు మీదే ఉండేది. ఐతే.. ఇండియా తొలి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 24 రన్స్ మాత్రమే చేసింది.

Latest Updates