హైదరాబాద్ లో భారీ వర్షం

rain-in-hyderabad-city

హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. గంటపాటు వాన దంచికొట్టింది. అక్కడా ఇక్కడా అని కాదు.. సిటీ అంతటా పడింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం చిన్నగా మొదలై.. సిటీ అంతటా దట్టమైన నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం వేళ భారీ వర్షం పడింది.

దాదాపుగా గంటపాటు వర్షం దంచికొట్టింది. కుండపోతగా కురవడంతో.. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు వరదలా పారాయి. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రద్దీ వేళ వర్షం పడటంతో.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్లు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు.. చుట్టుపక్కల జిల్లాల్లోనూ జల్లులు కురిశాయి. అల్పపీడనం ప్రభావం, రుతుపవనాల ప్రభావంతో వర్షం కురిసినట్టు వాతావరణ అధికారులు చెప్పారు.

వర్షాకాలం మొదలైనా ఇంకా వర్షాలు పడకపోవడంతో.. అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఐతే.. వాతావరణంలో మార్పులతో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. 2, 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్పారు.

Latest Updates