వ‌ర్షానికి కూలిన ఇల్లు: రోడ్డున ప‌డ్డ ఫ్యామిలీ

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ప‌లుచోట్ల శుక్ర‌వారం ఈదురుగాలుల‌తో భారీ వ‌ర్షం పడింది. దీంతో కొన్నిచోట్ల వ‌రిధాన్యం త‌డిసి పోయింది. మామిడి కాయ‌లు నేల రాలాయి. భువ‌న‌గిరి మండ‌లంలోని వీర‌వెల్లి గ్రామంలో రాత్రి ఈదురు గాలుల‌తో అకాల‌ వ‌ర్షం ప‌డింది. దీంతో గ్రామానికి చెందిన రేపాక మంజుల ఇంటి పైక‌ప్పు రేకులు ఊడి పోయాయి. మంజుల భ‌ర్త రేపాక శ్రీను 4 సంవ‌త్స‌రాల క్రిత‌మే మ‌ర‌ణించాడు. ఆమెకు ముగ్గురు ఆడ‌పిల్ల‌లు, ఓ అబ్బాయి. అంద‌రూ చిన్న పిల్ల‌లే. ఇంటికి పెద్ద దిక్కులేని త‌న కుటుంబాన్ని ఆదుకోవాల‌ని క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది మంజుల‌.

అస‌లే ఆర్థికంగా వెన‌క‌బ‌డ్డ ఆమె ఫ్యామిలీ, ఇప్పుడు సొంత ఇల్లు కూడా కూలి పోవ‌డంతో పిల్ల‌ల‌తో రోడ్డున ప‌డ్డారు. అధికారులు ప‌ట్టించుకుని త‌క్ష‌ణ‌మే ఆమెకు డ‌బుల్ బెడ్ రూం ఇల్లు నిర్మాణం చేప‌ట్టాల‌ని తెలిపారు గ్రామ‌స్థులు.

Latest Updates