భారత్ – కివీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. ఇప్పుడేం జరగొచ్చంటే..?

మాంచెస్టర్ .. ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం భారీ వర్షం పడుతోంది. ఇండియా- న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న కీలకమైన తొలి సెమీఫైనల్ కు వర్షం అడ్డుపడింది. చినుకులు పడినప్పుడు ఆట కొనసాగించినప్పటికీ… వర్షం పెరగడంతో… అంపైర్లు ప్లే ను తాత్కాలికంగా ఆపేశారు. దీంతో.. పెవీలియన్ కు వెళ్లిపోయారు ప్లేయర్లు. ఆ తర్వాత వర్షం మరింత పెరిగింది.

వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో న్యూజీలాండ్ 5 వికెట్ల నష్టానికి 211 రన్స్ చేసింది. రాస్ టేలర్ 67 రన్స్ తో.. లాథమ్ 3 రన్స్ తో క్రీజులో ఉన్నారు.

వర్షం పడుతోంది… ఇప్పుడేం జరగొచ్చు.. వరల్డ్ కప్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్ భారత్ కు అనుకూలంగానే ఉంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఈ మ్యాచ్ లో ఈజీగా గెలిచి ఇండియా ఫైనల్ కు చేరుతుందని అభిమానులు ఆశించారు. ఐతే.. వర్షం పడటంతో.. అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. వర్షం వెలిస్తే.. నిర్దేశించే లక్ష్యం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఏర్పడింది.

వర్షం వెలిస్తే… న్యూజీలాండ్ మళ్లీ బ్యాటింగ్ చేయకుండా ఉంటే.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియాకు 46 ఓవర్లలో 237 రన్స్ టార్గెట్ ఉంటుంది. లేదా.. 20 ఓవర్లలో 148 రన్స్ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. 

వరల్డ్ కప్ సెమీస్/ఫైనల్స్ లో రూల్స్ ఇలా ఉన్నాయి.

1.ఒకవేళ వర్షం వల్ల ఇవాళ మొత్తం మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోతే.. రేపు రిజర్వ్ డే కాబట్టి.. మ్యాచ్ ను యాజిటీజ్ గా ఎక్కడ ఆగిందో అక్కడినుంచి కొనసాగిస్తారు. అంతేగానీ మ్యాచ్ మొదటి నుంచి ప్రారంభించరు.

2.సెమీస్/ఫైనల్ మ్యాచ్ టై అయితే.. సూపర్ ఓవర్ తో ఫలితం తేలుస్తారు.

3. సెమీస్ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే.. లీగ్ దశనాటికి మెరుగైన పాయింట్లు ఉన్న జట్టు ఫైనల్ కు వెళ్తుంది.

4. ఫైనల్ కూడా వర్షం వల్ల ఆగిపోతే.. ట్రోఫీని ఫైనలిస్టులు ఇద్దరూ షేర్ చేసుకుంటారు.