వర్షంతో ముగిసిన తొలిరోజు ఆట : భారత్ స్కోరు 202/0

విశాఖపట్నంలో భారత్,దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ  జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ వర్షం కురుస్తుండడంతో తొలిరోజు ఆట ముగిసింది. ఇంకా 30 ఓవర్ల ముందే మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన బ్యాటింగ్ తో బరిలోకి దిగింది టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ భారీ స్కోర్ సాధించే దిశగా బ్యాటింగ్ తో చెలరేగి పోయారు. ఆట ముగిసే సమయానికి 115 పరుగులతో రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ 84 పరుగులతో ఉన్నారు.

Latest Updates