నేడు, రేపు తేలికపాటి జల్లులు

హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లోని కొన్ని ప్రాంతాలు సహా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం చిరు జల్లులు కురిశాయి. ఇవాళ ఉదయం నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని షేక్‌‌పేటలో 6.0  మి.మీ, జూబ్లీహిల్స్​లో 2.3 మి.మీ వర్షం నమోదైంది. నగరంలో 33 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

రాగల రెండు మూడు రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. భారీ వర్ష సూచనలు మాత్రం లేవని తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల్లో 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. ఇవాళ, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Latest Updates