ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు

రాష్ట్రంలోఇవాళ(సోమవారం) అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న(ఆదివారం) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం మాత్రం పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా.. దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Latest Updates