ఇయ్యాల, రేపు అక్కడక్కడ వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్నిచోట్ల శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర చత్తీస్ గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొన్ని చోట్ల మోస్తరు వానలు పడ్డాయి. సంగారెడ్డిలోని మల్చెల్మలో 7.2, మెదక్ లోని నర్సాపూర్ లో 7, చిప్పల్తుర్తి లో 6.5, సంగారెడ్డిలోని హత్నూరలో 6.5, మెదక్ లోని బోడగట్టు లో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.

Latest Updates