వ‌చ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో వ‌ర్షాలు

హైద‌రాబాద్ : మూడు రోజులుగా ఎండలు దంచికొడుతుండగా.. రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వ‌చ్చే మూడు రోజుల్లో సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ర్టంలో తేలిక‌పాటి నుంచి పలుచోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని.. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

వృద్ధులు బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించింది.  నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌గ‌టి స‌మ‌యాల్లో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతున్న విష‌యం తెలిసిందే. ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వ‌ర్షాలు కురిస్తే ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌నుంది. వరికోత రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వ్యవసాయ అధికారులు.

Latest Updates