
వర్షాకాలం సీజన్ కొనసాగుతుంది. రెండు చినుకులు పడితే చాలు.. ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు .జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కాకరకాయ పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం కాకరకాయ. ఇది చేదుగా తినడానికి చేదుగా ఉన్నా.. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే, వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి, సూక్ష్మక్రిములు, దోమలు వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే రైనీ సీజన్ లో కాకరకాయ సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడే కాకర కాయను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు వర్షాకాలం సీజన్లో శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.
ALSO READ : Health alert: ఫ్రూట్ జ్యూస్ ఎక్కువుగా తాగుతున్నారా.. కేన్సర్ రావచ్చు.. బీ అలర్ట్
జీర్ణవ్యవస్థ బలోపేతం: వర్షాకాలంలో గ్యాస్... అజీర్ణం .. కడుపు నొప్పి వంటి సమస్యలు తరచుగా పెరుగుతాయి. కాకరకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచమే కాకుండా ... మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు పొట్టను శుభ్రపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
రోగనిరోధక శక్తి: వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు... జలుబు ... దగ్గు సర్వసాధారణం. కాకరకాయలో విటమిన్ సి .. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి.. సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
షుగర్ కంట్రోల్ : రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది: కాకరకాయలో చరాన్టిన్, పాలీపెప్టైడ్-పి, వైసిన్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్‌ను అనుకరిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి. ఇది డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి కాకరకాయ సహాయపడుతుంది.వర్షాకాలంలో చురుకుదనం తగ్గినప్పుడు డయాబెటిక్ రోగులకు కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కాలేయ రక్షణ: వర్షాకాలంలో వేయించిన ఆహార పదార్దాలు.. బయటి ఆహారం కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాకరకాయ కాలేయం పనితీరును మెరుగుపరచడమే కాకుండా పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరంలోని విషపూరిత పదార్దాలను తొలగిస్తుంది.
చర్మం జుట్టు ఆరోగ్యం: వర్షాకాలంలో చర్మంపై మొటిమలు.. జుట్టులో చుండ్రు సమస్యలు ఎక్కువుగా ఉంటాయి. కాకరకాయ శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది, ఇది చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. ఇది జుట్టు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మలేరియా .. డెంగ్యూ నివారణ: వర్షాకాలంలో విజృంభించే మలేరియా .. డెంగ్యూ వంటి వ్యాధులను అరికడుతుంది. కాకరకాయలో సహజంగా రక్తాన్ని శుభ్రపరిచే లక్షణం ఉంటుంది. కాకరకాయ శరీరంలోని ఇన్ఫెక్షన్లను బయటకు పంపుతుంది.
ఎలా తినాలి
- కాకరకాయను ఉడకబెట్టుకొని కూర చేసుకుని తినవచ్చు.
- కాకరకాయ రసం (కొంచెం నిమ్మకాయతో కలిపి) ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
- ఉడికించిన కాకరకాయను తేలికపాటి ఉప్పుతో కలపండి.