యాసంగి రైతు బంధుకు రూ.5100 కోట్లు రిలీజ్

యాసంగికి రైతు బంధు పథకం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. రూ. 5,100 కోట్లను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్ లో రైతు బంధు పెట్టుబడి సాయం కింద రెండు సీజన్లకు కలిపి రూ. 12,862 కోట్లు కేటాయించింది. ఖరీఫ్ లో రూ. 6,900 కోట్లు విడుదల చేసింది. అందులో రూ. 5,460 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం. తాజాగా రెండో విడత పెట్టుబడి సాయం కింద రూ. 5,100 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదలైంది. ఆర్థిక శాఖ ఇచ్చిన అనుమతులకు అనుగుణంగా అడ్మినిస్ట్రేటివ్‌ సాంక్షన్‌ ఇస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. యాసంగి మొదట్లోనే ఈ నిధులు రావాల్సి ఉండగా.. రెండు నెలలు ఆలస్యంగా మంజూరయ్యాయి.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates