అందుకే పారిపోయా..కారు యాక్సిడెంట్ పై రాజ్ తరుణ్

raj-tarun-clarifie-to-narsing-road-accident

నార్సింగ్ రోడ్డు వద్ద జరిగిన కారు ప్రమాదంపై హీరో రాజ్ తరుణ్ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చాడు. ప్రమాదానికి గురైంది తన కారేనని..తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశాడు.తాను 3 నెలలుగా అదే రోడ్డు వెంట ప్రయాణం చేస్తున్నానని.. ఆ రోడ్డు వెంట ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని అన్నాడు. ప్రమాదం జరిగినప్పుడు తాను సీటు బెల్టు పెట్టుకున్నానని..సడెన్ గా టర్నింగ్ ఉండటంతో కారు అదుపు తప్పి గోడను ఢీ కొట్టిందని చెప్పాడు. దీంతో తన కళ్లు బైర్లు కమ్మాయన్నాడు. చెవులు మూసుకుపోయాయని.. అందుకే భయంతో ఇంటి వైపు పరుగెత్తానని అన్నాడు. తన ఇంటికి దగ్గర్లోనే ప్రమాదం జరిగిందని.క్షేమంగా ఉన్నానని అన్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ లో పాల్గొంటానని వివరణ ఇచ్చాడు రాజ్ తరుణ్.

 

Latest Updates