రన్నింగ్ కామెంట్రీ ఆపేయ్

బాల్క సుమన్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యూనివర్సిటీలు, విద్యారంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్​బాబు మాట్లాడుతుండగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తరుచూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తరచూ కాంగ్రెస్‌ సభ్యుల మాటలకు  బాల్క సుమన్‌ అడ్డుతగులుతుండడంతో ‘రన్నింగ్ కామెంట్రీ ఆపేయ్’ అంటూ రాజగోపాల్‌ గట్టిగా సూచించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. స్పీకర్ వారించడంతో వెనక్కి తగ్గారు.

‘చిన్న కాళేశ్వరం’ ఎప్పుడైతది?: శ్రీధర్​బాబు

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన నియోజకవర్గంలో పొలాలకు సాగునీరందడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు అన్నారు. తమ నియోజకవర్గం నుంచే రాష్ట్రం మొత్తానికి నీళ్లు వెళ్తున్నా స్థానిక రైతులకు సాగునీరు అందడం లేదని, గోదావరి నీళ్లు పొందడం స్థానిక రైతుల హక్కు కాదా అని ప్రశ్నించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే 45 వేల ఎకరాలకు నీళ్లందుతాయన్నారు. భూపాలపల్లి జిల్లాకు సాగునీరు అందించేందుకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయింపుల్లేకపోవడం విచారకరమన్నారు. ఆర్థిక మాంద్యం ఉందని, పన్నుల రాబడి తగ్గిందని, కేంద్రం నిధులు తక్కువగా వస్తున్నాయని, 15వ ఫైనాన్స్​ నిధులు కూడా తగ్గే అవకాశం ఉందని ఓ వైపు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ప్రసంగంలో చెబుతూనే రూ.కోటీ83 లక్షలతో బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఎలా ప్రవేశపెట్టారో, ద్రవ్య​లోటును ఎలా పూరిస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు.రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకీ వీసీ లేరని, బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో వర్సిటీలకు కేటాయించిన రూ.530 కోట్లు శాలరీలకే సరిపోవన్నారు. 30, 40 ఏళ్ల నుంచి కరెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిలు ఉన్నాయంటూ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీకు కరెంట్ కట్ చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.

For More News..

పీసీసీ చీఫ్ నువ్వా.. నేనా..

ఇండియాలో కరోనా తొలి మరణం

అప్పుడు కేసీఆర్‌‌ను బండ బూతులు తిట్టిన

Latest Updates