సాహో గురించి రాజమౌళి మాట్లాడుతుండగా..

rajamouli-gets-a-shock-in-saaho-pre-release-event

సాహో సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో సందడిగా జరిగింది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ సహా.. మూవీ యూనిట్ మొత్తం ఈవెంట్ లో పాల్గొంది. ప్రభాస్ ఎంట్రీని అభిమానుల కళ్లుచెదిరేలా ప్లాన్ చేశారు. ఆ సమయంలో స్టేజీ అంతా వెలిగిపోయింది. ప్రభాస్ తో బాహుబలి లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా వేడుకకు హాజరయ్యారు.

రాజమౌళి.. సాహో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. స్టేజీపై ప్రభాస్- సుజీత్ ల గురించి రాజమౌళి మాట్లాడుతున్నప్పుడు ఓ అభిమాని వేదికపైకి దూసుకొచ్చాడు. రాజమౌళికి ఎడమవైపున.. తన మోకాలిపై కూర్చుని.. ప్లీజ్ అన్నట్టుగా బతిమలాడాడు. స్పీచ్ మధ్యలో ఆగిన రాజమౌళి.. ఇబ్బందిగా.. ఆయన్ను దూరం వెళ్లమని కోరారు. నిర్వాహకుల్లో ఒకరు వెంటనే వేదికపైకి వచ్చి.. అతన్ని వెనక్కి తీసుకుపోయాడు. ఆ తర్వాత రాజమౌళి తన స్పీచ్ కంటిన్యూ చేశారు.

బాహుబలి తర్వాత.. ఏ సినిమా చేద్దామని ఆలోచిస్తున్న టైమ్ లో.. సుజీత్ చెప్పిన కథ ప్రభాస్ కు బాగా నచ్చిందని చెప్పారు రాజమౌళి. కథను మాత్రమే నమ్మి ప్రభాస్ ఈ సిినిమా అంగీకరించాడని అన్నారు. సుజీత్ ఎలా చేస్తాడనే సందేహం.. ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడే పటాపంచలైందని అన్నారు రాజమౌళి. టీజర్, ట్రైలర్ తో సుజీత్ కష్టం బయటపడింది.. సాహో బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని చెప్పారు దర్శకధీరుడు.

Latest Updates