ఒకే వేదికపై రజనీకాంత్-కమల్ హాసన్

తమిళ సూపర్‌స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. చెన్నైలోని రాజ్ కమల్
ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కార్యాలయ ఆవరణలో సినీ దర్శకుడు కె. బాలచందర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. కమల్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టినా.. కళపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారని ఆయన అన్నారు. కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

Latest Updates