రైటింగ్.. షూటింగ్.. ఏది నిజం!

తనదైన స్టైల్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్నారు రజినీకాంత్. డెబ్భై యేళ్లకు చేరువవుతున్నా ఇప్పటికీ తెరపై ఆయన ఎనర్జీ చూసి మెస్మరైజ్ అయిపోతారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఆయన ‘అన్నాత్తె’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అజిత్‌‌‌‌తో వరుస విజయాలు అందుకున్న శివ ఈ సినిమాకి దర్శకుడు. సన్ ‌‌‌‌పిక్చర్స్‌‌‌‌ నిర్మిస్తోంది. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. కరోనాతో బ్రేక్ పడిన ఈ మూవీ షూటింగును తిరిగి మొదలుపెట్టాలని టీమ్ అనుకుంటోంది. కానీ కోవిడ్ ప్రభావం తగ్గకపోవడంతో రజినీ షూట్​లో జాయిన్ అవ్వడానికి రెడీగా లేరని తెలుస్తోంది.

తాజా అప్​డేట్​ ప్రకారం నవంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మళ్లీ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రజినీ లేని సీన్స్ ముందుగా తీస్తారని.. అవి పూర్తయ్యాక మళ్లీ గ్యాప్ ఇచ్చి వచ్చే ఏడు షూట్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. రజినీ వయసు రీత్యా టీమ్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. విలేజ్‌‌‌‌ బ్యాక్‌‌‌‌ డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ సినిమాకు రజినీకాంత్  డైలాగ్స్‌‌‌‌ రాస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో బాబా సినిమాకి కథ, కథనంతో పాటు కొన్ని డైలాగ్స్ కూడా రజినీ రాయడంతో ఈ వార్తకి కొంత బలం చేకూరుతోంది. టీమ్ ఈ విషయాలపై రియాక్ట్ అయితే నిజానిజాలపై ఫుల్ క్లారిటీ వస్తుంది.

Latest Updates