రాజశేఖర్ ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నారు: డాక్టర్లు

కరోనాతో  బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేరిన సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య ప‌రిస్థితి  ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉందని  ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందన్నారు. రాజ‌శేఖ‌ర్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉందంటూ ఆయ‌న కుమార్తె శివాని కూడా ట్వీట్ చేశారు. మీ అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీస్తుల‌కు కృత‌ఙ్ఞ‌త‌లు అని తెలిపింది.

ఇదే సమయంలో డాక్టర్లు కూడా రాజశేఖర్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఓ వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. రాజశేఖర్ భార్య జీవిత కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. ఇవాళ(శనివారం) చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశామని చెప్పారు డాక్టర్లు.

Latest Updates