ముంబైని కట్టడి చేసిన రాజస్థాన్ బౌలర్లు

జైపూర్: రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  ముంబైని  తక్కువ స్కోరుకే కట్టడి చేశారు బౌలర్లు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ముంబైని 13 ఓవర్ల తర్వాత రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ డీకాక్ 47 బంతుల్లో 65, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులతో రాణించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్ కు 97 పరుగులు చేశారు.  దీంతో ముంబై 161 పరుగులు చేయగల్గింది. రాజస్థాన్ కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబై. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్ కు 2 వికెట్లు, స్టువర్ట్ బిన్ని, జోఫ్ర ఆర్కర్, జయదేవ్ ఉనద్కత్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.

ముంబై ఇండియన్స్ స్కోరు డీకాక్ 65, రోహిత్ శర్మ5, సూర్యకుమార్ యాదవ్ 34, హార్థిక్ పాండ్య, 23, పోలార్డ్ 10, బెన్ కటింగ్ 13, కృనాల్ పాండ్య 2 పరుగులు చేశారు.

Latest Updates