స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్..ముంబైపై విక్టరీ

ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ అలవోకగా టార్గెట్ ను చేధించింది. కెప్టెన్ స్మిత్ 59, సంజుసామ్సన్ 35, రియాన్ పరాగ్ 43 పరుగులతో రాణించడంతో ఇంకో ఐదు బాల్స్ ఉండగానే రాజస్థాన్  విజయం సాధించింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్  20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. డికాక్ 65, సూర్యకుమార్ యాదవ్ 34, హార్దిక్ పాండ్యా 23 పరుగులు  చేయడంతో  162 పరుగుల టార్గెట్ ను రాజస్థాన్ ముందుంచింది.

162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు ఆరంభంలోనే రహానే ఔటయ్యాడు. తార్వాత స్టీవెన్ స్మిత్, సంజూ సామ్సన్ బ్యాట్ కు పని చెప్పారు. స్మిత్ 59 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ 19 బంతుల్లో 35  పరుగులు చేయడంతో గెలుపు ఈజీ అయ్యింది . తొమ్మిది మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ కు ఇది మూడో విజయం.

Latest Updates