మీ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఇలాంటి కేటుగాళ్లున్నారేమో..

మీ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఇలాంటి కేటుగాళ్లున్నారేమో తస్మాత్ జాగ్రత్త . ఇటీవల కర్ణాటకకు చెందిన ఐపీఎస్ హరికిషన్ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫేస్ బుక్ అకౌంట్ పేరుతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తన స్నేహితులు, బంధువుల వద్ద నుంచి ఫండ్స్ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో పోలీస్ అధికారి డీఎస్పీ ప్రకాష్ రాథోడ్ ను సైతం తనపేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుతో అప్రమత్తమైన  సీఐడీ అధికారులు రాజస్థాన్ కు చెందిన బల్వీందర్ సింగ్, సిమ్ డిస్ట్రిబ్యూటర్ అన్సర్ ఖాన్ లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా..ఫేస్ బుక్ అకౌంట్ల తో ఎలా మోసం చేస్తారో వివరించారు.

నిందితులు ఎలా మోసం చేస్తారంటే  

మీ ఫ్రెండ్స్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేస్తారు. డబ్బులు అవసరం అంటూ మాయామటలు చెప్పి డబ్బుల్ని వసూలు చేస్తారు. సిమ్ కార్డ్ డిస్టిబ్యూటర్లతో కుమక్కై ఫోటోల్ని, అడ్రస్ లతో ఫేక్ ఆధార్ కార్డ్ లను తయారు చేసి బ్యాంక్ లను  నుంచి కాల్ చేస్తున్నామంటూ వివరాల్ని తీసుకుంటారు. ఆ తరువాత అకౌంట్లు, ఆన్ లైన్ వ్యాలెట్ల లో ఉన్న సొమ్మును కాజేస్తున్నట్లు తేలింది. సీఐడీ అధికారుల విచారణలో ఈ తరహా మోసాలు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలో ఎక్కువ జరగుతున్నట్లు గుర్తించారు.

Latest Updates