మొబైల్ డేటాను వినియోగించాడంటూ తమ్ముడిని హత్య చేసిన అన్న

ఆస్తుల కోసం హత్యలు చేసే రోజులు పోయి..సెల్ ఫోన్ల కోసం..అందులో వాడే డేటా కోసం హత్యలు చేసే రోజులు రావడం ఆందోళనకరంగా మారింది.

రాజస్థాన్ జోద్ పూర్ కు చెందిన అన్న రమణ్ (23)..,తమ్ముడు రాయ్ ను హత్య చేశాడు. అందుకు కారణం మొబైల్ డేటాను వినియోగించడమే. ఎప్పటిలాగే తమ్ముడు రాయ్..,అన్న రమణ్ మొబైల్ లో వీడియోలు చూడడంతో మొబైల్ డేటా అయిపోయింది. దీంతో నిందితుడు తమ్ముడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నా మొబైల్ లో డేటా మొత్తం వాడుకున్నావ్ అంటూ దాడి చేశాడు. విక్షణ కోల్పోయిన నిందితుడు రమణ్ కత్తితో తమ్ముడిని పొడిచాడు.  అన్నదమ్ముల వాగ్వావాదంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుణ్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలిచారు. కానీ అప్పుడే బాధితుడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బాధితుడి మరణంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

 

 

 

Latest Updates