రాయల్స్ రాజసం..పంజాబ్ పై రికార్డ్ ఛేజింగ్

  • రాజస్తాన్‌ ‘రికార్డు’ ఛేజింగ్
  • ​చెలరేగిన శాంసన్‌ , స్మిత్‌ , తెవాటియా
  • మయాంక్‌ సెంచరీ వృథా

ఫోర్ల వరద.. సిక్సర్ల హోరుతో తడిసి ముద్దయిన ఐపీఎల్‌ మ్యాచ్‌ లో రాజస్తాన్‌ రికార్డు విజయాన్ని అందుకుంది. శాంసన్‌ , స్మిత్‌ , తెవాటియా చేసిన పరుగుల విధ్వంసంలో పంజాబ్‌ బౌలర్లు నిలువెల్లా వణికిపోయారు. ఫలితంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో రాజస్తాన్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ ను చిత్తు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (50 బాల్స్‌‌లో 106, 10 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో.. పంజాబ్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 223 రన్స్‌‌ సాధించింది. రాహుల్‌ (54 బాల్స్‌‌లో 69, 7 ఫోర్లు, 1 సిక్స్‌‌) అండగా నిలిచాడు. తర్వాత రాజస్తాన్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 226 రన్స్‌‌ చేసి గెలిచింది.తెవాటియా ఫస్ట్‌ 19 బాల్స్‌‌లో 8 రన్స్‌‌ చేస్తే, తర్వాతి 12 బాల్స్‌‌లో 7 సిక్సర్లతో 45 రన్స్‌‌ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. శాంసన్​కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ ’ అవార్డు లభించింది.

మయాంక్‌ సెంచరీ జోరు..

అసలే బ్యాటింగ్‌ పిచ్‌ .. ఆపై బౌలర్ల నుంచి ఏమాత్రం ప్రతిఘటన లేదు. దీంతో పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్‌ , రాహుల్‌ ఆకాశమే హద్దుగాచెలరేగిపోయారు. నీళ్లు తాగినంత సులువుగా ప్రతి బౌలర్‌ ఓవర్‌ లో ఫోర్లు, సిక్సర్లతో ఉతికి ఆరేశారు. ముఖ్యంగా రాజ్‌ పుత్‌ వేసిన రెండో ఓవర్‌ లో సిక్సర్‌ తో మొదలైన మయాంక్‌ జోరు.. చివరి వరకు కొనసాగింది. మూడో ఓవర్‌ లో 4, 6తో 17 రన్స్‌‌ పిండుకున్నాడు. ఇక టీమ్ మేట్ ని చూసి ఇన్‌ స్పైర్‌ అయిన రాహుల్‌ .. నాలుగో ఓవర్‌ లో 4, 4, 4తో 13 రన్స్‌‌ రాబట్టాడు.ఐదో ఓవర్‌ లో ఇద్దరు కలిసి మూడు ఫోర్లతో 17 రన్స్‌‌ సాధించడంతో.. పవర్‌ ప్లే ముగిసేసరికి పంజాబ్‌ స్కోరు 60కి చేరింది. పేసర్లు ధారాళంగా రన్స్‌‌ ఇచ్చుకోవడంతో ఏడో ఓవర్‌ లో ఛేంజ్‌ బౌలర్‌ గా శ్రేయస్‌‌ గోపాల్‌ వచ్చాడు. అయినా మయాంక్‌ సిక్సర్ల వర్షం మాత్రం ఆగలేదు. ఎనిమిదో ఓవర్‌ (తెవాటియా) లో 6, 6, 4తో 19, తర్వా తి ఓవర్‌ లో 6, 6తో 16 రన్స్‌‌ దంచికొట్టాడు. ఈ క్రమంలో మయాంక్‌ 26 బాల్స్‌‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌ గా ఫస్ట్‌ టెన్‌ ముగిసేసరికి పంజాబ్‌ 110 రన్స్‌‌ చేసిం ది. 11వ ఓవర్‌ నుంచి వీరిద్దరి ఆట మరో మెట్టు ఎక్కింది. 12వ ఓవర్‌ లో ఎక్కు వ స్ట్రయికింగ్‌ తీసుకున్న మయాంక్‌ 6, 4 బాదితే, రాహుల్‌ ఫోర్‌ కొట్టడంతో 18 రన్స్‌‌ వచ్చాయి. అదే జోరులో రాహుల్‌ 35 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేశాడు. తర్వాతి ఓవర్‌ లో మయాంక్‌ .. లాంగాన్‌ లో మరో సిక్స్‌‌ కొట్టాడు. 14వ ఓవర్‌ లో మరో రెండు ఫోర్లు రావడంతో స్కోరు 150 దాటింది. 15వ ఓవర్‌ లాస్ట్‌ బాల్‌ ను రోప్‌ దాటించిన మయాంక్‌ 45 బాల్స్‌‌లో ఐపీఎల్‌ లో ఫస్ట్‌ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఓవర్‌ ముగిసే టైమ్‌‌కు 11.46 రన్‌ రేట్‌‌తో 172 రన్స్‌‌ సాధించి పంజాబ్‌ ను పటిష్ట స్థితిలో నిలిపాడు. మంచి జోరుమీదున్న ఈ జోడీని 17వ ఓవర్‌ లో కరన్‌ విడగొట్టాడు. లో ఫుల్‌ టాస్‌‌గా వేసిన యార్కర్‌ ను గాల్లోకి లేపిన మయాంక్‌ .. డీప్‌ మిడ్‌ వికెట్‌‌లో శాంసన్‌ చేతికి చిక్కాడు. దీంతో ఫస్ట్‌ వికెట్‌‌కు 183 రన్స్‌‌ పార్ట్‌ నర్‌ షి ప్‌ ముగిసింది. ఫించ్‌ హిట్టర్‌ గా వచ్చిన మ్యాక్స్‌‌వెల్‌ (13 నాటౌట్‌‌) అంచనాలకు అనుగుణంగా ఆడాడు. కానీ 18వ ఓవర్‌ లో భారీ షాట్‌‌కు ప్రయత్నించి రాహుల్‌ ఔటయ్యాడు. మ్యాక్స్‌‌వెల్‌ తో కలిసిన పూరన్‌ (8 బాల్స్‌‌లో 25 నాటౌట్‌‌, 1 ఫోర్‌ , 3 సిక్సర్లు) కూడా బ్యాట్‌‌ ఝుళిపించాడు. లాస్ట్‌ ఓవర్‌ లో రెండు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌ తో 18 రన్స్‌‌ రాబట్టాడు. లాస్ట్‌ ఐదు ఓవర్లలో 51 రన్స్‌‌ రావడంతో పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది.

సూపర్‌ త్రయం..
రాజస్తాన్‌ కూడా టార్గెట్‌‌ ఛేజింగ్‌ ను దూకుడుగానే మొదలుపెట్టింది. తొలి ఓవర్‌ లో రెండు ఫోర్లు కొట్టిన కెప్టెన్‌ స్మిత్‌ ముందుండి ఇన్నింగ్స్‌‌ను నడిపిస్తే.. మరో ఓపెనర్‌బట్లర్‌ (4) మాత్రం విఫలమయ్యాడు. మూడో ఓవర్‌ లో కాట్రెల్ (1/52)కు వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. వన్‌ డౌన్‌ లో వచ్చిన శాంసన్‌ వచ్చి రావడంతోనే సిక్సర్‌ తో ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మరో ఫోర్‌ బాదడంతో 11 రన్స్‌‌ వచ్చాయి. నాలుగో ఓవర్‌ లో స్మిత్‌ సిక్స్‌‌, ఫోర్‌ తో రెచ్చి పోయాడు. ఇదే సీన్‌ ను తర్వా తి ఓవర్‌ లో శాంసన్‌ రిపీట్‌‌ చేశాడు. ఆరో ఓవర్‌ లో స్మిత్‌ మూడు ఫోర్లు బాదడంతో ఈ ఐపీఎల్‌ లో పవర్‌ ప్లేలో హయ్యెస్ట్‌ స్కోరు (69/1) నమోదైంది. స్పిన్నర్లకు బాల్‌ ఇచ్చినా ఈ ఇద్దరి జోరు మాత్రం తగ్గలేదు. రవి బౌలింగ్‌ (7వ ఓవర్‌ )లో సిక్స్‌‌తో 11, అశ్విన్‌ వేసిన 8వ ఓవర్‌ లో మరో సిక్స్‌‌తో 12 రన్స్‌‌ వచ్చాయి. ఈ క్రమంలో స్మిత్‌ 26 బాల్స్‌‌లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే తొలి స్పె ల్‌ కు దిగిన నీషమ్‌‌.. 9వ ఓవర్‌ లాస్ట్‌ బాల్‌ కు స్మిత్‌ ను ఔట్‌‌ చేయడంతో రెండో వికెట్‌‌కు 81రన్స్‌‌ పార్ట్‌ నర్‌ షిప్‌ బ్రేక్‌ అయ్యింది. పది ఓవర్లలో రాజస్తాన్‌ స్కోరు 104/2కు చేరిం ది. శాంసన్‌ 27 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ను చేరాడు. ఈ దశలో రవి, మ్యాక్స్‌‌వెల్‌ స్కోరుకు కళ్లెం వేసినా… శాంసన్‌ దూకుడును మాత్రం ఆపలేదు. కానీ రెండో ఎండ్‌ లో టెవాటియా ఘోరంగా విసిగించాడు. చివరకు14వ ఓవర్‌ లో శాంసన్‌ భారీ సిక్సర్‌ తో ఊపు తెస్తే, 15వ ఓవర్‌ లో
టెవాటియా ఫస్ట్‌ సిక్సర్‌ బాదడంతో స్కోరు 140/2గా మారింది. ఇక 30 బంతుల్లో 84 రన్స్‌‌ చేయాల్సిన దశలో శాంసన్‌ రెచ్చి పోయాడు. మ్యాక్సీ వేసిన 16వ ఓవర్‌ లో 6, 6, 6తో 21 రన్స్‌‌ దంచాడు. చివర్లో తెవాటియా విధ్వంసంతో రాయల్స్​ ఈజీగా గెలిచింది.

Latest Updates