RR vs MI: ఐపీఎల్ (IPL 2026) ప్లేఆఫ్స్ బెర్త్‌ను తేల్చే ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. రాజస్థాన్ నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ (MI) ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఘోరంగా తడబడింది. RR పేసర్లు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బెర్గర్ ముంబై టాప్ ఆర్డర్ బ్యాటర్లను డగౌట్‌కు పంపించడంతో ఈ ఉత్కంఠ పోరు రాజస్థాన్ వశమైంది. ఈ ఓటమితో ముంబై ఇంటికి వెళ్లిపోయింది.
ఖాతా తెరవకుండానే రోహిత్ అవుట్:
భారీ చేజింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు కనీసం పరుగుల ఖాతా కూడా ఓపెన్ చేయకుండానే మొదటి వికెట్ కోల్పోయింది. స్టార్ ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (0) ను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేసి ముంబై ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిండు. ఆర్చర్ ఇక్కడితోనే ఆగలేదు.. ఆ కాసేపటికే ప్రమాదకరంగా మారేలా కనిపించిన నమన్ ధీర్ (6) ను కూడా తన అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేసి పడేశాడు. దీంతో ముంబై జట్టు 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
ఆర్చర్ ఒకవైపు వికెట్లు తీస్తుంటే.. మరో ఎండ్ నుంచి నాండ్రే బెర్గర్ ముంబైని కోలుకోకుండా దెబ్బకొట్టిండు. క్రీజులో సెట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ముంబై మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (12) ను అవుట్ చేశాడు. దీంతో ముంబై 24 రన్స్‌కే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టైమ్‌లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ కూడా కేవలం 3 పరుగులకే పెవిలియన్‌కు క్యూ కట్టాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ జాక్స్ కిరాక్ షాట్లతో గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదాడు. అయితే 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 33 పరుగులు చేసిన జాక్స్.. యష్‌రాజ్ పుంజా బౌలింగ్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా దూకుడికి బ్రేక్:
అనంతరం కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 34 పరుగులు) క్రీజులోకి రాగానే భారీ షాట్లతో రాజస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ముంబై స్కోరు 149 పరుగుల దగ్గర ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో నాండ్రే బెర్గర్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన కార్బిన్ బోష్ (2) కూడా యష్‌రాజ్ పుంజా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ వృథా:
మరోవైపు ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ.. ఈ సీజన్‌లో తన రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ, నాండ్రే బెర్గర్ వేసిన ఒక స్మార్ట్ బంతికి అతడికే క్యాచ్ ఇచ్చి సూర్య పెవిలియన్‌కు చేరుకోవడంతో.. ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించి సగర్వంగా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. దీంతో మే27వ (బుధవారం) తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఎలిమినేటర్ –1లో రాజస్థాన్ పోటీ పడనుంది.
A 𝙍𝙤𝙮𝙖𝙡 𝙀𝙣𝙩𝙧𝙮 into the Playoffs ✅
— IndianPremierLeague (@IPL) May 24, 2026
Make way for the @rajasthanroyals 🩷#TATAIPL | #KhelBindaas | #MIvRR pic.twitter.com/egtoP5bh7e
We are officially in the endgame now! 🎬
— IndianPremierLeague (@IPL) May 24, 2026
1️⃣0️⃣ started the race, but only 4️⃣ survived the carnage 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/k4kq8R5WbL
4️⃣ teams. 1️⃣ winner
— IndianPremierLeague (@IPL) May 24, 2026
All roads lead to the ultimate glory 🏆#TATAIPL | #TheFinalLeap pic.twitter.com/waI2u61Q4t
